BREAKING: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు.. ఖాతాల ఫ్రీజ్‌ పిటిషన్ కొట్టివేత

by Shiva |   ( Updated:2024-03-22 10:47:51.0  )
BREAKING: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు.. ఖాతాల ఫ్రీజ్‌ పిటిషన్ కొట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలక్టోరల్ బాండ్ల ఆరోపణలతో కాంగ్రెస్ ఖాతాలన్నింటినీ ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. ఖాతాలను పునరుద్ధరించినా.. అందులోని రూ.105 కోట్ల ట్యాక్స్ బకాయి చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే‌ ఇవ్వడాన్ని నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement

Next Story