BREAKING: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యేది తేదీనే!

by Disha Web Desk 1 |
BREAKING: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు జమ అయ్యేది తేదీనే!
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సాయం నిధుల జమపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు జూన్ 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, ఆ వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఆర్థిక సాయం జూన్ చివరి వారంలో జమ కావాల్సిన డబ్బులు కాస్త ముందుగానే రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ-కేవైసీ చేయించుకోని రైతులకు అర్థిక సాయం అందదని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవడానికి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in‌ను విజిట్ చేయాలని సూచించారు. కాగా, దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు ప్రధాన మంత్రి కిషన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. రైతులకు ఆర్థికంగా చేయూతను అందించేందుక కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేపెట్టింది. ఇందులో భాగంగా సంవత్సరానికి రైతులకు రూ.6 వేల చొప్పున మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Next Story

Most Viewed