Manipur riots: మణిపూర్ అల్లర్లపై దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభయ సభలు రేపటికి వాయిదా

by Satheesh |   ( Updated:2023-07-24 11:30:53.0  )
Manipur riots:  మణిపూర్ అల్లర్లపై దద్దరిల్లిన పార్లమెంట్.. ఉభయ సభలు రేపటికి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా మణిపూర్ అల్లర్లపై మరోసారి ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్‌లో గత కొంత కాలంగా జాతుల మధ్య చోటు చేసుకుంటున్న అల్లర్లపై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంతో మణిపూర్ అల్లర్లపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓకే చెప్పారు. కానీ ప్రధాని మోడీనే దీనిపై చర్చించాలని పట్టుబట్టిన విపక్షాలు అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకున్నాయి.

మణిపూర్ అల్లర్లపై ఇరు సభల్లో ప్రధాని మోడీ మాత్రమే స్టేట్మెంట్ ఇవ్వాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో అధికార బీజేపీ ఎంపీలు వెస్ట్ బెంగాల్, రాజస్థాన్‌లో చోటు చేసుకన్న ఘటనలను ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వ, విపక్ష నేతలు మధ్య మాటల యుద్ధం జరిగింది. అధికార పార్టీ, విపక్ష పార్టీల నేతల పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో సభ సజావుగా సాగలేదు. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు గందరగోళంగా మారాయి. దీంతో ఇరు సభల స్పీకర్లు సభను రేపటికి వాయిదా వేశారు.

Advertisement

Next Story

Most Viewed