Naresh Goyal: జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కు ఊరట

by Shamantha N |
Naresh Goyal: జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కు ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో: జెట్ ఎయిర్ వేస్(Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్(Naresh Goyal) కు ఊరట దక్కింది. నరేశ్ గోయెల్(75) కు అనారోగ్య కారణాల రీత్యా బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన నరేశ్‌ గోయల్‌కు బాంబే హైకోర్టు రెండు నెలల తాత్కాలిక బెయిల్‌ను మంజూరుచేసింది. బెయిల్‌పై కొన్ని షరతులు విధించింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా ముంబై వీడకూడదని, రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పాస్‌పోర్టు కూడా సరెండర్‌ చేయాలని జస్టిస్‌ ఎన్‌జే జామ్‌దార్‌తో కూడిన సింగిల్‌ బెంచ్‌ సూచించింది. దీంతో గోయల్‌ మరోసారి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనతోపాటు తన భార్య అనితా గోయల్‌ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నందున పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పిచ్చింది.

అసలు కేసు ఏంటంటే?

దేశీయ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టి జెట్‌ ఎయిర్‌వేస్‌ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరులో నరేశ్‌ గోయల్‌ను అరెస్టు చేసింది. అదే ఏడాది నవంబర్‌లో గోయల్‌ భార్యను అరెస్ట్‌ చేసినప్పటికీ.. ఆమె అనారోగ్య పరిస్థితి కారణంగా ప్రత్యేక కోర్టు అదేరోజు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement

Next Story