ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

by Hamsa |   ( Updated:2023-02-28 06:12:16.0  )
ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని ఓ ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. వల్సాద్ జిల్లాలో ఉన్న జిఐడిసి కెమికల్ జోన్‌లోని వాన్ పెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, పేలిన రసాయనం గురించి తెలియక మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేకపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story