కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: డీకే అరుణ

by Satheesh |   ( Updated:2023-05-05 13:06:24.0  )
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నేతలు హిందూ దేవుళ్లపై నోరు పారేసుకుంటున్నారని, కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాయిచూరు రూరల్ నియోజకవర్గం యాపల్ దిన్నె మండలంలో బీజేపీ అభ్యర్థి తిప్పపారాజు నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

కర్ణాటకలో మరోసారి బీజేపీ విజయఢంకా మోగడం ఖాయమని, దేశం, రాష్ట్రం, జిల్లా, మండలాలు, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని డీకే అరుణ అన్నారు. ప్రధాని మోడీపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం, హిందువు దేవుళ్ళ పై నోరు పారేసుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమని డీకే అరుణ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవియా, మైసూర్ పార్లమెంట్ సభ్యుడు ప్రతాపసింహా ఉన్నారు.

Also Read...

బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం అదే: MP సుమలత కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story