రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ ప్రయత్నం: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్

by Dishanational2 |
రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ ప్రయత్నం: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతోందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ అన్నారు. నియంతృత్వ మార్గంలో నడుస్తూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని రక్షించుకోవాలంటే బీజేపీని ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన బారామతి లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఉన్నాయన్నారు. ఎందుకంటే దేశం ఏ పద్దతిలో పయనిస్తుందో నిర్దేశించేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ‘ఎన్నికల టైంలో కుట్రతోనే సీఎం కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారు. నియంతృత్వ దోరణితో దేశాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలంటే కాషాయ పార్టీని ఓడించాలి’ అని వ్యాఖ్యానించారు. దేశ ప్రజాస్వామ్యం పట్ల ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన నెలకొందని తెలిపారు. కాగా, బారామతి నియోజకవర్గం నుంచి ఎన్సీపీ(ఎస్పీ) తరఫున శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఎన్సీపీ తరఫున అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌లు పోటీ పడుతున్నారు.



Next Story

Most Viewed