బ్రేకింగ్: రాహుల్ గాంధీపై స్పీకర్‌కు BJP మహిళ ఎంపీలు కంప్లైంట్

by Satheesh |   ( Updated:2023-08-09 11:27:51.0  )
బ్రేకింగ్: రాహుల్ గాంధీపై స్పీకర్‌కు BJP మహిళ ఎంపీలు కంప్లైంట్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్ సభకు హాజరైన రాహుల్ గాంధీ.. అవిశ్వాస తీర్మానంపై చర్చించారు. అనంతరం ఆయన సభ నుండి వెళ్తూ ప్లయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళ ఎంపీలు లోక్ సభ స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ఇతర ఎంపీల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ లోక్ సభ ప్రతిష్టను మంటగలిపారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఈ వ్యహారంపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. లోక్ సభలో మహిళలంతా కూర్చొని ఉన్నారని.. రాహుల్ గాంధీ సంస్కారహీనంగా ప్రవర్తించడం బాధకరమని అన్నారు. అసలు రాహుల్ గాంధీకి ఏమైందని ప్రశ్నించారు.

Read More..

మరో వివాదంలో రాహుల్ గాంధీ.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఎంపీలు

Advertisement

Next Story

Most Viewed