సొంత జిల్లాలో కాంగ్రెస్ చీఫ్‌కు షాక్

by Harish |
సొంత జిల్లాలో కాంగ్రెస్ చీఫ్‌కు షాక్
X

కలబురగి (కర్ణాటక): సొంత జిల్లాలో కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు ఎం మల్లికార్జున ఖర్గే కు షాక్ తగిలింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆ పదవులను బీజేపీ చేజిక్కించుకుంది. మే లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ గెలుపు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విశాల్ దర్గికి 33 ఓట్లు వచ్చాయి. కేవలం ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ కాపనూర్ ఓటమిపాలయ్యారు. డిప్యూటీ మేయర్ విషయంలోనూ అదే జరిగింది. శివానంద్ పిస్టికి 32 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి ఓటమిపాలయ్యారు.

Advertisement

Next Story