- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Aaditya Thackeray: ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్న చేయడమే బీజేపీ కల- ఆదిత్య ఠాక్రే

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే కాషాయపార్టీ కల అని మండిపడ్డారు. తమ పార్టీకి, కేజ్రీవాల్‌కు, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో భవిష్యత్తులో నితీశ్ జేడీయూకి, ఆర్జేడీ పార్టీకి, చంద్రబాబు టీడీపీకి అదే జరుగవచ్చని అన్నారు. ఢిల్లీలో పర్యటించిన ఆదిత్య ఠాక్రే, ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి రాహుల్ గాంధీని కలిసినట్లు తెలిపారు. గురువారం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. కాగా, దేశ భవిష్యత్తు సందేహంలో ఉందని ఆదిత్య ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇవాళ దేశంలో ఓటర్ల జాబితాలో మోసం, ఈవీఎం మోసాల మధ్య మన ఓటు ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం మన దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరుగుతున్నాయా? మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామని భావిస్తున్నాం, కానీ అది ఇకపై ప్రజాస్వామ్యం కాదు. మాకు (శివసేన), కేజ్రీవాల్, కాంగ్రెస్‌కు ఏమి జరిగిందో, భవిష్యత్ లో నితీశ్, ఆర్జేడీ పార్టీకు, చంద్రబాబుకు అదే జరుగవచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేసి అంతం చేయడమే బీజేపీ కల’ అని అన్నారు.
షిండే చర్యలపై స్పందించిన ఆదిత్య
మరోవైపు, శివసేన విభజనకు కారణమైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సన్మానించడంపై వ్యాఖ్యానించేందుకు ఆదిత్య ఠాక్రే నిరాకరించారు. ‘నేను దాని గురించి మాట్లాడను. ఇలాంటి వ్యక్తిని (షిండే) మా వర్గం ఎప్పుడూ గౌరవించదు. ఆయన మా పార్టీనే కాదు మహారాష్ట్రను కూడా మోసం చేశారు.’ అని విమర్శించారు. ఇకపోతే, ఇండియా కూటమి భవిష్యత్ పైనా ఆదిత్య మాట్లాడారు. ఈ కూటమిలో చాలా మంది సీనియర్ నేతలతు న్నారని. దానికోసం వారు రోడ్ మ్యాప్ ని రెడీ చేస్తారని చెప్పారు. ‘ఇండియా కూటమికి ఉమ్మడి నాయకత్వం ఉంది. ఒకే వ్యక్తి నాయకుడిగా లేడు. ఈ పోరాటం ఒకరికోసం కాదు.. దేశ భవిష్యత్ కోసం’ అని అన్నారు.