చైనా కమ్యూనిస్టు పార్టీ నిధులపై లోక్ సభలో దుమారం..

by Vinod kumar |
చైనా కమ్యూనిస్టు పార్టీ నిధులపై లోక్ సభలో దుమారం..
X

న్యూఢిల్లీ : కాంగ్రెస్, చైనా, "న్యూస్‌ క్లిక్‌" ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ఒకే జాతికి చెందినవని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ కామెంట్ చేశారు. "న్యూస్‌ క్లిక్‌" కు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ వచ్చిన మీడియా రిపోర్ట్స్‌ను ప్రస్తావిస్తూ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాపై రాహుల్‌కు ఉన్న ప్రేమ కనిపిస్తోందని, ఆ పార్టీ వ్యక్తులు భారత వ్యతిరేక అజెండాను నడుపుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నకిలీ ప్రేమ దుకాణాల్లో చైనా వస్తువులు ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. "నెవిల్లే రాయ్‌ సింగంకు చెందిన న్యూస్ క్లిక్‌ అనేది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకరమైన సాధనం" అని పేర్కొంటూ న్యూయార్క్‌ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. "న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి నిధులు అందుతున్నాయి. ఆ నిధులతో ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దేశ వ్యతిరేక విధానాలు అనుసరిస్తోన్న కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపించాలి" అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మాటలను వెంటనే లోక్ సభ రికార్టుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. ఆన్‌ ది రికార్డు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎలా అనుమతి లభించిందో విచారణ జరపాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed