రామ్ చరణ్ ముద్దుగా ఉపాసనను ఏమని పిలుస్తాడో తెలుసా.. గ్లోబల్ స్టార్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

by Kavitha |
రామ్ చరణ్ ముద్దుగా ఉపాసనను ఏమని పిలుస్తాడో తెలుసా.. గ్లోబల్ స్టార్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా..?
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసనల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని 14 జూన్ 2012లో ఇరు పెద్దల సమక్షంలో వివాహ బంధం లోకి అడుగుపెట్టారు. ఇక పెళ్లైన దాదాపు 11 సంవత్సరాలకి మెగా ప్రిన్సెస్ క్లీంకార వీరికి జన్మించింది. అయితే స్టార్ హీరోగా రామ్ చరణ్, మెగా ఇంటి కోడలిగా, అపోలో సంస్థల ప్రతినిధిగా ఉపాసన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ కపూల్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. బేసిక్‌గా ఈ మధ్యకాలంలో పెట్ నేమ్స్ అనేవి ఎంత ఎక్కువగా పెరిగిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కడుపులోని బిడ్డ బయటకు రాకముందు నుంచే కూడా ముద్దు ముద్దు పేరుతో పిలుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా కొంతమంది స్టార్స్, రొమాంటిక్ కపుల్స్ తమ భార్యలను ముద్దు పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. బుజ్జులు, కన్నలు, బేబీ , డార్లింగ్, స్వీటీ అంటూ రొమాంటిక్‌గా కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో చరణ్ ఉపాసనను ఏమని పిలుస్తాడనే న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

రామ్ చరణ్ కూడా తన భార్య ఉపాసనను "ఉప్సి - ఉప్సి" అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారట. ఫోన్లో కూడా అదే పేరుతో సేవ్ చేసుకున్నాడట. మొదటి నుంచి రామ్ చరణ్‌కి ఉపాసనను అలా పిలవడమే ఇష్టమట. ఆశ్చర్యం ఏంటంటే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో ప్రేమగా ఉపాసనను ఉప్సి అనే పిలుస్తుందట. ఇక చిరంజీవి ఒక్కడే ఉపాసన తల్లి అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తాడట. అలాంటి ఒక స్పెషల్ స్థానాన్ని సంపాదించుకుంది ఉపాసన మెగా కుటుంబంలో. ఇలాంటి కోడలు అందరి ఇంటికి రావాలి అంటూ చాలామంది మెగా ఫ్యాన్స్ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. ఉపాసన తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇస్తుందో తన అత్తమామలకు కూడా అంతే గౌరవం ఇస్తుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. గ్లోబల్ స్టార్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story