Mahayuti : ‘మహాయుతి’ సర్కారు కొలువుతీరే ముహూర్తం ఫిక్స్ ?

by Hajipasha |
Mahayuti : ‘మహాయుతి’ సర్కారు కొలువుతీరే ముహూర్తం ఫిక్స్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర(Maharashtra)లో అధికార ‘మహాయుతి’(Mahayuti) సర్కారు కొలువుతీరే తేదీపై బీజేపీ(BJP) వర్గాల నుంచి కీలక సమాచారం తెలిసింది. డిసెంబరు 2న బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని సమాచారం. ఈ అవకాశాన్ని పొందే నేతకే సీఎంగా అవకాశాన్ని కల్పిస్తారు. డిసెంబరు 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. కూటమిలోని బీజేపీ, ఎన్‌సీపీ, శివసేనలకు మంత్రి పదవుల కేటాయింపుపైనా డిసెంబరు 2కల్లా స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

గతంలో రెండు సార్లు సీఎంగా వ్యవహరించిన బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ మహారాష్ట్ర సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. బీజేపీ నేతలు మురళీధర్‌, వినోద్ తావ్డే, రాధాకృష్ణ విఖే పాటిల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక మహారాష్ట్ర హోంశాఖ తనకే ఇవ్వాలని మాజీ సీఎం, శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నారు. అయితే దాన్ని సీఎం అయ్యే వ్యక్తికి అప్పగిస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఈవిషయంలో షిండే, బీజేపీ పెద్దల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు.

Advertisement

Next Story

Most Viewed