పొలిటికల్ యాడ్స్‌లో బీజేపీనే టాప్

by S Gopi |
పొలిటికల్ యాడ్స్‌లో బీజేపీనే టాప్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అనేక రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే, ప్రజల వద్దకెళ్లి ఓట్లు అడగటం ఎంత ముఖ్యమో మీడియా మాధ్యమాల్లో యాడ్స్ ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం అంతే ముఖ్యమని పార్టీలు భావిస్తాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు భారీగా యాడ్స్ ఇస్తున్నాయి. దీనికోసం ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) వద్ద ఆమోదం కోసం అత్యధిక సంఖ్యలో యాడ్స్ వచ్చాయని, అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీవే ఎక్కువ ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి 13 నుంచి మే 8వ వరకు బీజేపీ మొత్తం 2,084 యాడ్‌ల ఆమోదం కోసం 517 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 349 యాడ్స్ కోసం 118 దరఖాస్తులను పంపింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 6 దరఖాస్తులు అందజేసింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి మొత్తం 638 దరఖాస్తులు వస్తే 2,423 యాడ్స్‌కు సీఈఓ ఆమోదం తెలిపారని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీకి చెందిన 16 యాడ్స్ ఇంకా ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో రాజకీయ పార్టీలు షార్ట్ ఫిల్మ్‌లు, క్రియేటివ్‌లు, యాడ్స్ కోసం ఈసీ నుంచి ఆమోదం పొందడం తప్పనిసరి.

Advertisement

Next Story