- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
J&K: జమ్మూకశ్మీర్ ఎన్నికలకు నాలుగో జాబితాను విడుదల చేసిన బీజేపీ
దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన నాలుగో జాబితాను సోమవారం విడుదల చేసింది. ఆరుగురితో కూడిన లిస్ట్‌లో నౌషేరా నియోజకవర్గం నుంచి పార్టీ యూనిట్ చీఫ్ రవీందర్ రైనా పోటీ చేయనున్నారు. ఈ ప్రకటనతో సెప్టెంబర్ 18న జరిగే మొదటిదశ పోలింగ్‌లో 90 మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటివరకు 51 మంది అభ్యర్థులను ప్రకటించినట్టు అయింది. రెండో దశ సెప్టెంబర్ 25న, మూడవ దశ అక్టోబర్ 1న నిర్వహించనున్నారు. భారత ఎన్నికల సంఘం హర్యానాతో పాటు అక్టోబర్ 8న జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తుంది. తాజా జాబితాలో లాల్ చౌక్ నుంచి ఐజాక్ హుస్సేన్, ఈడిగా నుంచి ఆరిఫ్ రాజా, ఖాన్‌సాహిబ్ నుంచి అలీ మహ్మద్ మీర్, చరార్-ఏ-షరీఫ్ నుంచి జాహిద్ హుస్సేన్, నౌషెరా నుంచి రవీందర్ రైనా, రాజౌరి నుంచి విబోధ్ గుప్తా పేర్లను ప్రకటించారు. మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, మాజీ మంత్రులు సత్‌పాల్ శర్మ, ప్రియా సేథీ, షామ్ లాల్ చౌదరీ సహా సీనియర్ నేతలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు.