- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒడిశా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరు
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ)-బీజేపీ మధ్య పొత్తులకు సంబంధించి 17 రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తాజాగా స్పష్టత వచ్చింది. ఒడిశాలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ఎక్స్‌లో వ్యాఖ్యానించిన ఆయన ఈ ఎన్నికల్లో బీజేపీ 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే దిగుతుంది. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారత్, ఒడిశాను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పొత్తు లేకుండానే పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకుందని, ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను సాకారం చేయడమే లక్ష్యమని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పారు.
అలాగే, మోడీ ప్రభుత్వంలోని సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఒడిశాలోని పేదవారికి చేరడం లేదు. దేశంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న ప్రతిచోటా అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేయడం జరిగింది. ఆ రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని మన్మోహన్ సమాల్ అన్నారు. ఇంతకుముందు మార్చి 5న జాజ్‌పూర్ జిల్లాలోని చండీఖోలేలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగంలో 108వ జయంతి సందర్భంగా దిగ్గజ నాయకుడు బిజూ పట్నాయక్ గురించి గొప్పగా మాట్లాడారు, దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు పునరుద్ధరణకు అవకాశం ఉందనే ఊహగానాలు రాగా, గత కొద్ది రోజులుగా పొత్తులకు సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి.
గతంలో ఎన్డీయేలో భాగమైన బీజేపీ- బీజేడీ 1998 నుండి 2009 వరకు పొత్తులో ఉన్నాయి. బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ అప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో మంత్రిగా చేరారు. 2008లో ఒడిశాలో జరిగిన క్రైస్తవ వ్యతిరేక అల్లర్ల కారణంగా రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. రెండు పార్టీలు ఆ తర్వాత 2009 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. 2024 లోక్‌సభ, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాలని చూసినా ఇది విఫలమైంది.