- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమంగా చెట్లను నరికిన కేసులో బీజేపీ ఎంపీ సోదరుడు అరెస్ట్
బెంగళూరు: ఇటీవల పార్లమెంట్ భద్రతలో భారీ ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో కర్ణాటక జీబేపీ ఎంపీ ప్రతాప్ సింహా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడు కోట్ల రూపాయల విలువైన చెట్లను అక్రమంగా నరికిన కేసులో అరెస్ట్ అయ్యారు. ప్రతాప్ సింహా సోదరుడు విక్రమ్ సింహాపై హాసన్ జిల్లాలోని అటవీ శాఖకు చెందిన భూమిలో అనుమతుల్లేకుండా 126 చెట్లను నరికేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. డిసెంబర్ 24న కోట్ల విలువైన కలపను అక్రమంగా విక్రయించిన కారణంగా విక్రమ్ సింహాపై అధికారులు కేసు నమోదు చేశారు. తాజాగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పదిహేను రోజులకు పైగా కొనసాగిన చెట్ల నరికివేతకు సంబంధించి విక్రమ్ సింహాకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయని అటవీ అధికారులు వెల్లడించారు. 12 ఎకరాల అటవీ భూమీలో అల్లం పెనేందుకు ప్రభుత్వంతో విక్రమ్ సింహా ఒప్పందం చేసుకున్నారు. కానీ, దానికి విరుద్ధంగా 126 చెట్లను నరికినట్టు గుర్తించిన అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.