సోనియా, రాహుల్పై దేశద్రోహం కేసు పెట్టాలి.. కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

by Javid Pasha |   ( Updated:2023-08-10 11:19:15.0  )
సోనియా, రాహుల్పై దేశద్రోహం కేసు పెట్టాలి.. కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లను దేశద్రోహం కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. 2008లో బీజింగ్ ఒలంపిక్స్ లో తాను పాల్గొన్నానని, ఆ సమయంలో భారత క్రీడాకారులను కలవడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వస్తున్నారని తమకు చెప్పారని అన్నారు.

అయితే చైనాకు వచ్చిన సోనియా, రాహుల్ తమను కాకుండా చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలను కలిశారని గుర్తు చేశారు. ఈ రకంగా సోనియా, రాహుల్ గాంధీ దేశద్రోహానికి పాల్పడ్డారని, వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ నాయకత్వంలోనే యూపీఏ కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమికి సోనియా గాంధీ చైర్ పర్సన్ గా వ్యవహరించారు.

Next Story

Most Viewed