- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Betting Apps Promotion Case : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్... సచిన్, షారూఖ్, కోహ్లీలకు నోటీసులు!

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు(Betting Apps Pramotion Case) సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో 11 మంది యూట్యూబ్ స్టార్స్, పలువురు యాంకర్స్, నటులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పలువురు ప్రముఖ నటులపై కూడా పోలీసులు నజర్ పెట్టారు. ఈ లిస్టులో నందమూరి బాలకృష్ణ(Balakrishna), రాణా దగ్గుబాటి(Rana Daggubati), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, అనన్య నాగల్ల తదితరులు ఉన్నారు. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఈ కేసులో టాప్ క్రికెటర్స్, బాలీవుడ్ నటులకు కూడా సెగ తగలనుంది.
తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన షారుఖ్‌ఖాన్(Sharukh Khan), సచిన్(Sachin), కోహ్లీల(Virat Kohli)పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హైదరాబాద్ గ్రీన్స్ సొసైటీ(Hyderabad Green Society0 పేర్కొంది. ఈ వ్యవహారంలో అలాంటి బడా సెలెబ్రెటీస్ కోట్లు సంపాదించారని, వారిని వదిలి యూట్యూబర్స్‌ను టార్గెట్ చేయడం సబబు కాదని చెబుతున్నారు. ఆ సెలెబ్రెటీస్ మీద కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఫిర్యాదులో కొరతామని సొసైటీ నిర్వహకులు పేర్కొన్నారు. కాగా ఈ కేసు ఇప్పటికే ప్రమోషన్స్ చేసిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తుండగా.. ఇంకా ఎంతమంది ప్రముఖులు ఇందులో ఇరుక్కుంటారో చూడాలి మరి.
Read More..
HYDలో మరో సంచలనం.. షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన బాలీవుడ్ నటిపై అత్యాచారయత్నం