పోలీస్‌ను చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే: కేసు నమోదు

by samatah |
పోలీస్‌ను చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే: కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే ఓ పోలీస్‌ను చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 353 కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..పూణె కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే శుక్రవారం సాసూన్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రోగ్రామ్ ముగిసిన అనంతరం వేదిక నుంచి కిందకు దిగుతుండగా.. విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఆ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనా సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం పక్కనే ఉండటం గమనార్హం. దీనిపై సునీల్ కాంబ్లే స్పందించారు. ‘నేను ఎవరిపైనా దాడి చేయలేదు. మెట్లు దిగి వస్తున్నప్పుడు అడ్డంగా వస్తే.. అతనిని తోసుకుంటూ ముందుకు వెళ్లాను’ అని చెప్పారు.

Advertisement

Next Story