- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీలో బీజేపీకి ఓటమి తప్పదు.. అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు
పాట్నా: సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో బీజేపీ ఓటమి పాలవుతుందని అన్నారు. దశాబ్దాల పాటు పాలన చేస్తుందని పార్టీ పేర్కొన్నప్పటికీ, ప్రస్తుతం రోజులు లెక్కిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని రెండు మెడికల్ కాలేజిల్లో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటిస్తే బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే విషయం అర్థమవుతుందని అన్నారు. కస్టడీలో మరణించిన కుటుంబాలకు కోటి రూపాయాల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
లండన్, న్యూయార్క్ నుంచి పెట్టుబడులు తెస్తామని చెబుతూ.. జిల్లాల నుంచి పెట్టుబడులను తీసుకొస్తూ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారా అని ప్రశ్నించారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేతిలో అఖిలేష్ యాదవ్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. అయితే క్రితం సారితో పోలిస్తే సీట్ల సంఖ్యను మెరుగుపరుచుకుంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలపై జోస్యం చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.