- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కీలక శాఖలు బీజేపీ వద్దే? ప్రతి నలుగురు ఎంపీలకు 1 మంత్రి అడుగుతున్న మిత్రపక్షాలు
దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ 3.0 కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రి మండలిలో మిత్రపక్షాల కోటాను ఎలా అకామిడేట్ చేయబోతున్నారనే దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన పోర్ట్ పోలియోలను తమ వద్దే బీజేపీ అట్టిపెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారలు, రైల్వే, ఐటీ మంత్రిత్వ శాఖలను తామ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలు సైతం బీజేపీ ముందు భారీ డిమాండ్లను ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నలుగురు ఎంపీలకు 1 మంత్రిత్వ శాఖ కావాలని మిత్రపక్షాలు డిమాండ్ చేస్తుండగా వీటిలో కొన్ని డిమాండ్లకు బీజేపీ అంగీకరించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ పార్టీలు చెరో మూడు మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ మూడు మంత్రి పదవులతో పాటు లోక్ సభ స్పీకర్ పదవి కోరవచ్చని తెలుస్తోంది. ఇక రైల్వే శాఖను తమకు ఇవ్వాల్సిందిగా జేడీయూ కోరుతున్నట్లు సమాచారం.