మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్

by S Gopi |
మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్
X

దిశ, నేషనల్ బ్యూరో: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని ఎగతాళి చేస్తూ బీజేపీ నేత దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న క్లిప్‌లో దిలీప్ ఘోష్.. ముఖ్యమంత్రి తాను బెంగాల్ కుమార్తెనని చెప్పుకుంటున్నారు. ముందు ఆమె తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాల'ని అన్నారు. ఆమె గోవా వెళ్లి, తాను గోవా కూతురునని, త్రిపురకు వెళ్లు తాను త్రిపుర కుమార్తెనని చెబుతుంది. మొదట తన తండ్రి ఎవరో నిర్ధారించుకోవాలని బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిలీప్ ఘోష్‌ వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా స్పందించారు. రాజకీయం పేరుతో దిలీప్ ఘోష్ అవమానకరంగా మాట్లాడుతున్నారు. గతంలో దుర్గా మాతపైనా, ఇప్పుడు మమతా బెనర్జీపైనా దిలీప్ ఘోష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బెంగాల్ మహిళల పట్ల, అది హిందూ మతం పూజించే దేవత అయినా, భారత్‌లో ఉన్న ఏకైన మహిళా ముఖ్యమంత్రి పట్ల దిలీప్ ఘోష్‌కు ఎలాంటి గౌరవం లేదని టీఎంసీ నేతలు స్పందించారు. ఆయన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

Advertisement

Next Story