- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్‌లో చేరిన మిమ్మల్ని చూస్తే.. మీ తండ్రి ఆత్మ శాంతిస్తుందా?
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్‌పై ఆ రాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మీకు టికెట్ ఇచ్చినా మీరు గెలవలేరని సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌లో చేరిన జగదీష్ శెట్టర్‌కు సోమవారం ఈశ్వరప్ప సోమవారం బహిరంగ లేఖను రాశారు. తాము అధికారంలోకి వస్తే గో హత్య బిల్లును ఉపసంహరించుకుంటామని కాంగ్రెస్ చెబుతోందని మరి ఈ అంశంలో మీరు ఎవరికి మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంటామని డీకే శివకుమార్, సిద్ధరామయ్య చెబుతున్నారని అలాంటప్పుడు ఆ పార్టీలో చేరి మీరు ఉగ్రవాదానికి మద్దతిస్తారా? అన్నారు.
మీరు కాంగ్రెస్‌లో చేరికతో మీ తండ్రి ఆత్మ శాంతిస్తుందా?. బీజేపీ కోసం మీరు ఎంతో చేశారు. కాంగ్రెస్ లో ఎందుకు చేరారని మీ మనవడు అడిగితే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అందువల్ల మీరు క్షమాపణలు చెప్పి తిరిగి బీజేపీలోకి వచ్చి మతాన్ని, సిద్ధాంతాలను కాపాడాలని కోరారు. వీలైనంత త్వరగా బీజేపీలోకి తిరిగి వస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా అంతకు ముందు ఇవాళ ఉదయం పార్టీలో చేరిన సందర్భంగా జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల కోసం తాను ఎంతో కృషి చేశానని అయినా తనకు ఆ పార్టీలో అవమానం జరిగిందని ఆరోపించారు.
Karnataka BJP leader and former minister KS Eshwarappa writes an open letter to #JagadishShettar after he quit the party and joined Congress.
— ANI (@ANI) April 17, 2023
"...Congress may have given you a ticket but you will not win on the ground of struggle. If Congress comes to power, they said, they will… pic.twitter.com/IRqifnHHSc