- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నితీష్, కేసీఆర్ కలలు కంటున్నారు.. ముందు ఆ పని చేస్తే బాగుంటుంది'
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తన వ్యూహాలను జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ఇతర రాష్ట్రాల బీజేపీ ఇతర పార్టీలతో జత కడుతున్నారు. తాజాగా బీహార్ సీఎం నితీష్‌కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఓ ప్రెస్ మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే వీరిద్దరు కలవడంపై బీహార్ మాజీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో నితీష్ కుమార్, కేసీఆర్ ఇద్దరిలో ఎవరూ సీఎం కాలేరని ఆయన జోస్యం చెప్పారు.
'2024 ఎన్నికల్లో నితీష్ కుమార్, కేసీఆర్ ఇద్దరూ కూడా తమ తమ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కాలేరు. ఎవరైతే తమ రాష్ట్రాల్లో తమకున్న సీట్లను కాపాడుకోలేరో వారు పీఎం కావాలని కలలు కంటున్నారు' అని ఆయన అన్నారు. అంతేకాకుండా 2023లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సీఎం సీటుకు కాపాడుకుంటే బాగుంటుంది అని సుశీల్ మోడీ చురకలంటించారు.
Also Read : 'బిహార్ సీఎం అమాయకుడు.. కేసీఆర్ ఉచ్చులో చిక్కుకున్నాడు'