- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పీడ్ పెంచిన బీజేపీ.. కర్ణాటకలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ వేగం పెంచింది. మరోసారి అధికారం దక్కించేందుకు పావులు కదుపుతోంది. కన్నడిగులను ఆకట్టుకునేలా ఎన్నికల హామీలు ఇస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఆకర్షించేలా తయారు చేసిన ఈ మేనిఫెస్టోను సీఎం బస్వరాజ్ రాజ్ బొమ్మై, పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సమక్షంలో విడుదల చేశారు. ప్రధానంగా యువత సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ది, మహిళా సాధికారత, గో సంరక్షణ, ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చారు. ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాలుగు రోజులు పాటు కర్ణాటకలోనే ప్రచారం చేయనున్నారు. ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు.
కాగా కర్ణాటక ఎన్నికలు మే 10న జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పోటీ జరగనుంది. గత ఎన్నికల్లో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. మరోసారి సైతం సత్తా చాటాలని బీజేపీ యోచిస్తోంది. మిగిలన పార్టీలు కూడా ప్రజలను ఆక్టుకునే హామీలు ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి.