- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Muda scam: ముడా స్కామ్‌ను నిరసిస్తూ బీజేపీ-జేడీ(ఎస్) రెండో రోజు పాదయాత్ర
దిశ, నేషనల్ బ్యూరో: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా)సైట్ కేటాయింపులో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ బీజేపీ-జేడీ(ఎస్), రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పాదయాత్ర రెండో రోజు కూడా కొనసాగింది. ఆదివారం బిడాడిలో యాత్ర మొదలుకాగా రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో బీజేపీ, జేడీ(ఎస్) పార్టీ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని సీఎం సిద్ధరామయ్యకు, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డప్పు చప్పుళ్లతో పాదయాత్ర నిర్వహించారు.
ముడా స్కామ్‌కు పాల్పడిన సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బెంగళూరు నుండి మైసూరు వరకు వారం రోజుల పాదయాత్రను శనివారం ప్రారంభించారు. ఆదివారం రెండో రోజు ప్రారంభమైన నిరసన యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే బీవై విజయేంద్ర, జేడీ(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత చలవాది నారాయణస్వామి, జేడీ(ఎస్) నేత నిఖిల్ కుమారస్వామితోపాటు పలువురు శాసనసభ్యులు, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముడా కుంభకోణం విలువ రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు ఉంటుందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.