- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తోంది: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని, కానీ అధికార బీజేపీ మాత్రం ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ముంబైలో శనివారం పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. ముంబైలో కాంగ్రెస్ బలపడితేనే జాతీయ స్థాయిలో పటిష్టంగా ఉండగలదని తెలిపారు. ‘కాంగ్రెస్‌ని బలోపేతం చేయడం ప్రతి పార్టీ కార్యకర్త బాధ్యత. ముంబై, కాంగ్రెస్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఎందుకంటే పార్టీకి పునాది పడింది ముంబైలోనే. అంతేగాక ఉపాధి హామీ పథకం వంటి అనేక నిర్ణయాలు రూపొందించబడ్డాయి’ అని తెలిపారు. దేశం కోసం ఏమి చేశారో రాబోయే తరానికి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని వెల్లడించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశంలో ఎన్నో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారని గుర్తు చేశారు. మౌలిక సదుపాయాలు, టెలికాం రంగం తదితర అంశాల్లో దేశ పురోగతి, అభివృద్ధికి పార్టీ కీలకపాత్ర పోషించిందన్నారు. కానీ దేశ ప్రగతికి సంబంధించిన క్రెడిట్ కొట్టేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. ‘బీజేపీ కాంగ్రెస్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తుందని, 1989 నుంచి గాంధీ కుటుంబంలోని ఏ ఒక్కరు కూడా మంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రధానిగా అధికారంలో లేరని తెలిపారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందని, దీనిపై ప్రధాని మోడీ ఏ మాత్రం దృష్టి సారించలేరని మండిపడ్డారు.