- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ ప్రజల దృష్టి మళ్లిస్తోంది: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని దొండైచా గ్రామంలో బుధవారం జరిగిన సభలో ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. దేశంలో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం లేదని తెలిపారు. సంపన్నులకు రూ.16 లక్షల కోట్లను మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం రైతుల బకాయిలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపద 22 మంది వద్ద ఉన్న దానికి సమానమని తెలిపారు. అగ్రిపథ్ స్కీమ్ ద్వారా యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, రాహుల్ గాంధీ జోడో న్యాయ్ యాత్ర ఈనెల 17న ముంబైలో ముగియనుంది.