Manish Sisodia : హర్యానా ప్రజలకు కాషాయ పార్టీ ద్రోహం చేసింది

by Shamantha N |
Manish Sisodia : హర్యానా ప్రజలకు కాషాయ పార్టీ ద్రోహం చేసింది
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రజలకు ద్రోహం చేసిందని అన్నారు. “హర్యానా ప్రజలు ఎన్నో అంచనాలతో బీజేపీని ఎన్నుకున్నారు. కానీ, ప్రజలకు కాషాయ పార్టీ ద్రోహం చేసింది. ఏ పనీ చేయలేదు. హర్యానా ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారు” అని సిసోడియా అన్నారు. అక్కడి ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌కు అవకాశం ఇస్తారని అన్నారు. పూర్తి మెజారిటీతో హర్యానాలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో అవకాశం వచ్చినప్పుడు కేజ్రీవాల్ అద్భుతంగా పనిచేశారని తెలిపారు. అదే తరహాలో పంజాబ్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈసారి అరవింద్ కేజ్రీవాల్‌కు హర్యానాలో అవకాశం ఉందని సిసోడియా అన్నారు.

కాంగ్రెస్ ఎంపీ ఏమన్నారంటే?

ఇకపోతే, కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ కూడా తన పార్టీ అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఈసారి 70 సీట్లకు పైగా గెలుస్తుందని చెప్పారు. "హర్యానా కాంగ్రెస్‌కు చాలా సానుకూల అవకాశాలు ఉన్నాయి. మేమంతా ఈసారి 70 కంటే ఎక్కువ సీట్లు ఆశిస్తున్నాం. ఈ సారి ఫలితాలు కాంగ్రెస్ వైపు ఉన్నాయనిని మాకు తెలుసు. అందుకే, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో పాటు ఇతర విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తాం” అని తెలిపారు. అంతకుముందు, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఉన్న అవకాశాలను కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవదని ధీమా వ్యక్తం చేశారు. తెరవలేకపోతుందని పేర్కొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed