- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎన్డీయే సర్కారు 15 రోజులే ఉంటుందేమో- సీఎం కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇలాంటి టైంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనుగడపై సందేహాన్ని వ్యక్తం చేశారు. కొన్నిసార్లు కేవలం ఒకరోజులోనే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఏదైనా జరగొచ్చు.. ఎవరికేం తెలుసు.. ఈ ప్రభుత్వం 15 రోజులే ఉంటుందేమో ..? అని మమతా బెనర్జీ అన్నారు. 400 సీట్లు వస్తాయని దీమా వ్యక్తం చేసిన బీజేపీ.. కనీసం మెజారిటీ కూడా పొందలేకపోయిందని అన్నారు. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటు జరగదని అనుకోవద్దని హింట్ ఇచ్చారు. పరిస్థితులు మారిపోతూనే ఉంటాయని పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత కచ్చితంగా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అధికారం కోల్పోతే ఆనందిస్తా
చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. అందుకే తమ పార్టీ ప్రమాణస్వీకారానికి హాజరుకాదని స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో అన్నది తమ పార్టీ చూస్తోందని పేర్కొన్నారు. తమ పార్టీ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉందని అన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడకపోవచ్చని.. కానీ, రాబోవు రోజుల్లో అది సాధ్యమవుతోందని ధీమా వ్యక్తం చేశారు. దానికోసం మరికొంత కాలం వేచి చూస్తామన్నారు. కేంద్రంలో ఏర్పడే అస్థిర, బలహీన ప్రభుత్వం అధికారం కోల్పోతే తాను ఆనందపడతానని దీదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఈ లోక్ సభ ఎన్నికల తీర్పు మార్పు కోసమే అని అన్నారు. మోడీకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని.. అందుకే ఈసారి మరొకరు ప్రధాని పదవి చేపట్టాలని డిమాండ్ చేశారు.