బీజేపీ-బీజేడీలు తెర వెనుక మిత్రులు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

by samatah |
బీజేపీ-బీజేడీలు తెర వెనుక మిత్రులు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజూజనతా దళ్(బీజేడీ), బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఒడిశాలో పర్యటించారు. కటక్‌లోని సలేపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. బీజేపీ-బీజేడీలు ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ కలిసే పని చేస్తున్నాయని ఆరోపించారు. వారు తెరవెనుక మిత్రుల వంటి వారని అభివర్ణించారు. మోడీ ఢిల్లీ నుంచి కోటీశ్వరుల కోసం ప్రభుత్వాన్ని నడుపుతుంటే, ఒడిశా సీఎం పట్నాయక్ కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల గురించి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ-బీజేడీలు భాగస్వామ్య పార్టీలు గానే కొనసాగుతున్నాయని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు మాత్రమే వేర్వేరుగా పోటీ చేస్తున్నాయని మండిపడ్డారు. నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని మాత్రం ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ నడుతున్నారని ఆరోపించారు. అమిత్ షా, నరేంద్ర మోడీ, నవీన్ పట్నాయక్‌లు కలిసి ఒడిశా ప్రజల సంపదను దోచుకున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed