- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంజాబ్‌లోని 3 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో: ఉప ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాలకు, మేఘాలయాలోని ఏకైక స్థానంలో పోటీ చేయనున్న అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మేఘాలయాలోని గాంబిగ్రి(ఎస్టీ రిజర్వ్‌డ్) అసెంబ్లీ స్థానం, పంజాబ్‌లోని గిద్దర్బాహా, డేరా బాబా నానక్, బర్నాలా, చబ్బివాల్ అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 13వ తేదీన బైపోలింగ్ జరగనుంది. మేఘాలయాలోని గాంబిగ్రి స్థానంలో బెర్నార్డ్ మరాక్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలిపింది. కాంగ్రెస్ నుంచి జింగ్‌జాంగ్ ఎం మారక్ ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక పంజాబ్‌లో డేరా బాబా నానక్ నుంచి రవి కరణ్ కలాన్, గిద్దర్బాహా నుంచి పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ బాదల్, బర్నాలా నుంచి కేవల్ సింగ్ ధిల్లాన్‌లను పోటీకి దింపినట్టు బీజేపీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలకు రెండు దశల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 47 సీట్లు, ఒక పార్లమెంటు స్థానానికి నవంబర్ 13న, మిగిలిన రెండు స్థానాలకు నవంబర్ 20న బైపోల్స్ జరగనున్నాయి. నవంబర్ 23వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.