Biren Singh: నా క్షమాపణలను రాజకీయం చేయొద్దు.. మణిపూర్ సీఎం బిరేన్ సింగ్

by vinod kumar |
Biren Singh: నా క్షమాపణలను రాజకీయం చేయొద్దు.. మణిపూర్ సీఎం బిరేన్ సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌ (Manipur)లో నెలకొన్న అల్లర్లకు సంబంధించి తాను క్షమాపణలు చెప్పడంపై రాజకీయాలు చేయడం సరికాదని సీఎం బిరేన్ సింగ్ (Biren singh) అన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న వారు రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శాంతిని పునరుద్దరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని నొక్కి చెప్పారు. శుక్రవారం ఆయన ఇంఫాల్‌(Imphal)లో మీడియాతో మాట్లాడారు. నా ప్రకటనపై రాజకీయాలు చేస్తున్న వారు రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలకు ఎలాంటి సిద్దాంతాలూ లేవని, హింస వల్ల తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి క్షమాపణలు చెప్పడంలో తప్పేముందని ప్రశ్నించారు.

నేను ఉగ్రవాదులకు క్షమాపణలు చెప్పలేదని అమాయక ప్రజలకు, వారి ఇళ్లనుంచి అదృశ్యమైన వారికి మాత్రమే సారీ చెప్పానన్నారు. ‘రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలకు నేను శాంతి సందేశం ఇస్తున్నా. మరోసారి దయచేసి మమ్మల్ని క్షమించండి. గతంలో ఏం జరిగిందో మర్చిపోండి. అంతా కలిసి కూర్చుని శాశ్వత పరిష్కారం కనుగొనాలి. శాంతి పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలోనే బీరేన్ సింగ్ మణిపూర్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు వ విమర్శలు గుప్పించడంతో ఆయన స్పందించారు.

Advertisement

Next Story