పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..

by Vinod kumar |
పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
X

చండీగఢ్: పంజాబ్‌లోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీల చాన్స్‌లర్‌ బాధ్యతల నుంచి గవర్నర్‌‌ను తప్పిస్తూ, ఆ స్థానాన్ని ముఖ్యమంత్రితో భర్తీ చేసే బిల్లును తీసుకురాగా, ఆ బిల్లు మంగళవారం ఆమోదం పొందింది. ఈ మేరకు మంగళవారం నాటి అసెంబ్లీ సమావేశంలో ‘పంజాబ్ యూనివర్సీల చట్ట సవరణ బిల్లు 2023’ని ప్రవేశపెట్టగా, చిన్నపాటి చర్చల అనంతరం ఆమోదం పొందింది.

ఆ బిల్లుకు అధికార ఆప్‌తోపాటు శిరోమణి అకాలీ దళ్, బీఎస్పీ ఎమ్మెల్యేలు సైతం మద్దతు తెలిపారు. దీనిపై బీజేపీ నేతలు వ్యతిరేకంచగా, ఈ బిల్లు ఇప్పటికే బెంగాల్‌లో అమలవుతోందని సీఎం భగవంత్ మాన్ సమర్థించుకున్నారు. గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్, సీఎం భగవంత్‌కు మధ్య ఇటీవల పలు అంశాల్లో విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ బిల్లుతో యూనివర్సిటీల్లో వైస్ చాన్స్‌లర్ల నియామక అధికారం సీఎంకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed