- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బస్తీలో బడా కుబేరుడు.. మురికివాడలో బిల్‌గేట్స్
దిశ, నేషనల్ బ్యూరో : అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బుధవారం ఒడిశాలోని ఓ మురికివాడను సందర్శించారు. అక్కడి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి భువనేశ్వర్‌లోని ఒక మురికివాడను ఆయన సందర్శించారు. మా మంగళ బస్తీలోని బిజూ ఆదర్శ కాలనీకి వెళ్లి అక్కడున్న నిర్వాసిత ప్రజలతో ముచ్చటించారు. ఆ ఏరియాకు చెందిన మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులతో బిల్‌గేట్స్ సంభాషించారు. మురికివాడ నివాసులకు ఇచ్చిన భూమి హక్కులు, కుళాయి నీటి సదుపాయం, పారిశుద్ధ్య సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం వంటి వాటి గురించి ఈసందర్భంగా ఆయనకు ఒడిశా రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అను గార్గ్ వివరించారు. స్లమ్ ప్రాంతాన్ని మోడల్ కాలనీగా మార్చడం పట్ల గేట్స్ సంతోషం వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. ఇక హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC)ని కూడా బిల్ గేట్స్ సందర్శించారు.