Bihar: లోకో పైలట్ తప్పిదంతో రైల్వే కార్మికుడు మృతి.. నుజ్జునుజ్జునైన శరీరం

by Ramesh Goud |
Bihar: లోకో పైలట్ తప్పిదంతో రైల్వే కార్మికుడు మృతి.. నుజ్జునుజ్జునైన శరీరం
X

దిశ, వెబ్ డెస్క్: లోకో పైలట్(Loco Pilot) తప్పిదం(Mistake)తో రైల్వే కార్మికుడు(Railway Employee) మృతి(died) చెందిన ఘటన బీహార్(Bihar) లో చోటు చేసుకుంది. ఘటన ప్రకారం బెగుసరాయ్ లోని బరౌనీ జంక్షన్(Barouni Junction)లో అమర్ కుమార్ రావు అనే వ్యక్తి రైల్వే పోర్టర్(Railway Porter) గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డైలీ డ్యూటీ నేపథ్యంలో లక్నో- బరౌనీ ఎక్స్ ప్రెస్(Lucknow- Barouni Express) జంక్షన్ వద్దకు రాగానే షంటింగ్ ఆపరేషన్ లో భాగంగా రైలు కప్లింగ్ తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఆ సమయంలో రైలు అకస్మాత్తుగా వెనక్కి కదలడంతో అతడు క్యారేజీల మధ్య ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంలో రైల్వే కార్మికుడి శరీరం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలారం మోగడంతో గమణించిన లోకో పైలట్.. తన వల్లే ప్రమాదం జరిగిందని తెలుసుకొని సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఇంజిన్ రివర్స్ కావడమే ప్రమాదానికి కారణమని, ప్రమాదాన్ని నివారించడానికి అతడు ఎటువంటి చర్య తీసుకోలేదని రైల్వే అధికారులు గుర్తించారు. అనంతరం మరో లోకో పైలట్ సహాయంతో మృతదేహాన్ని కోచ్ ల మధ్య నుంచి తొలగించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed