- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nitish Kumar: అమిత్ షా చివరి ప్రయత్నం విఫలం.. కాసేపట్లో బీహార్ సీఎం రాజీనామా?
దిశ, వెబ్‌డెస్క్: Bihar CM Nitish Kumar to meet Governor Phagu Chauhan| బీహార్ రాజకీయం పీక్స్ చేరింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరి కాసేపట్లో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు మధ్యాహ్నం 12.30కు గవర్నర్‌తో నితీష్ కుమార్ భేటీ కానున్నారు. దీంతో ఆయన రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చివరి ప్రయత్నంగా నితీష్ కుమార్‌తో అమిత్ షా మాట్లాడినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో నితీష్ కేబినెట్లో ఉన్న 16 మంది మంత్రులు రాజీనామా చేయబోతున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంపై ఊహాగానాలు తారాస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈరోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. అయితే నితీష్ కుమార్ బీజేపీని వీడితే మహాకూటమి 2.0కి సిద్ధమని కాంగ్రెస్, ఆర్జేడీలు హామీ ఇచ్చిన నేపథ్యంలో గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం బీహార్ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తంది. నితీష్ కుమార్ రాజీనామా చేస్తే జేడీయూ-ఆర్జేడీ అలయన్స్‌తో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సీఎం అవుతారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా బీహార్ రాజకీయం క్లైమాక్స్‌కు చేరుకుంది. నితీష్ కుమార్ ఎత్తుగడతో బీజేపీ ఇరకాటంలో పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: మూడు రోజుల్లో ముఖ్యమంత్రిని చంపేస్తాం
- Tags
- Nitish Kumar