- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bihar: పిడుగుపాటుతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా: బీహార్ సీఎం
దిశ, నేషనల్ బ్యూరో: బీహార్‌లోని గయా, నలందలలో పిడుగుపాటుకు గురై మరణించిన ఏడుగురికి రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను కూడా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి సానుభూతిని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన.. పిడుగుపాటు కారణంగా గయలో ఐదుగురు, నలందలో ఇద్దరు మరణించడం బాధాకరం, మృతుల కుటుంబాలకు తక్షణం రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశాలిచినట్టు' పోస్ట్ చేశారు. పిడుగుపాటుకు గురై గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సూచించానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాక్షిస్తున్నట్టు నితీష్ కుమారు తెలిపారు. ప్రతికూల వాతవారణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందుకోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం సూచనలను పాటించాలని, వాతావారణం బాగాలేనపుడు ఇంట్లో ఉండాలని, అదే సురక్షితమన్నారు. కాగా, గత నెలలో, బీహార్‌లోని ఏడు జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.