Supreme Court: గనులపై రాయల్టీ బకాయిలు.. ఖనిజ సంపంద ఉన్న రాష్ట్రాలకు భారీ విజయం

by Shamantha N |
Supreme Court: గనులపై రాయల్టీ బకాయిలు.. ఖనిజ సంపంద ఉన్న రాష్ట్రాలకు భారీ విజయం
X

దిశ, నేషనల్ బ్యూరో: గనులపై రాయల్టీ బకాయిల విషయంలో ఖనిజసంపద ఉన్న రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో భారీ విజయం దక్కింది. గనులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీపై గత బకాయిలు వసూలు చేసుకునేందుకు ఉన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఏప్రిల్ 1, 2005 నుంచి ఉన్న బకాయిలను కేంద్రం నుంచి రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. రానున్న 12 ఏళ్లలో దశలవారీగా ఈ చెల్లింపులు చేయొచ్చని కేంద్రానికి సూచించింది. బకాయిల చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీలు విధించవద్దని రాష్ట్రాలను ఆదేశించింది. మరోవైపు, ఖనిజాలు ఉన్న భూమిపై రాయల్టీని విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని గత నెలలో సుప్రీం కోర్టు పేర్కొంది.

రాయల్టీ అనేది పన్నుతో సమానం కాదు

సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మందితో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. 8 మంది న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో ఈ తీర్పుని వెల్లడించారు. రాయల్టీ అనేది పన్నుతో సమానం కాదని కోర్టు అభిప్రాయపడింది. మరోవైపు, జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు లబ్ధి చేకూరనుంది. ఒడిశా, జార్ఖండ్, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు ఈ తీర్పు వల్ల ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వాలు తమ భూభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీలపై అదనపు సుంకాలు వసూలు చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed