- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సామాన్యులకు బిగ్ షాక్.... ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఔషద ధరలు!
దిశ, డైనమిక్ బ్యూరో:నిత్యావసర ధరల పెరుగుదలతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు మరో బిగ్ షాక్ తలగనున్నది. ఏప్రిల్ 1 నుంచి నిత్యావసర ఔషధాల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటీ బయాటిక్స్ తో పాటు 800 మందులపై టోకు ధరల సూచిక డబ్ల్యూపీఐలో వార్షిక మార్పులకు అనుగుణంగా, .0055 శాతం ధరలను పెంచుకునేందుకు ఫార్మా ఇండస్ట్రీకి కేంద్రం అనుమతించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పారసిటమాల్, అజిత్రోమైసిన్ లాంటి యాంటీబయోటిక్,యాంటీ అనీమియా మెడిసన్స్, విటమిన్స్, మినరల్స్ తో పాటు కోవిడ్ ట్రీట్ మెంట్ లో ఉపయోగించే నిత్యావసర మందుల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
కాగా 2022, 2023లో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్ఎల్ఈఎం) క్రింద ఔషధాల ధరలలో రికార్డు స్థాయిలో 12 శాతం నుంచి 10 శాతం పెరిగాయి. ఆ తర్వాత ఫార్మా పరిశ్రమకు ఇది స్వల్ప పెరుగుదల. సవరించిన ధరలు జాతీయ అవసరమైన ఔషధాల జాబితాలో చేర్చబడిన 800 కంటె ఎక్కువ మందులను కవర్ చేస్తాయి. షెడ్యూల్ చేయబడిన ఔషధాల ధరలను సంవత్సరానికి ఒకసారి సవరించేందుకు అనుమతించబడుతుంది.