- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టులో బిగ్ షాక్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూలై 6 వరకు సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్‌పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులకు చార్జిషీట్ పత్రాలు ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. మరో వైపు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నాడంటూ ఈడీ ఆరోపించించిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడంతో ఈ కేసు కీలక మలుపు తీసుకోబోతుందనే చర్చ జరుగుతోంది. ఈ కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందని ఈడీ ఇప్పటికే ఆరోపించింది. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి తీసుకున్న నిర్ణయం సంచలనం అవుతోంది.