మాయవతికి బిగ్ షాక్!..ఖాతా తెరవని బీఎస్పీ

by vinod kumar |
మాయవతికి బిగ్ షాక్!..ఖాతా తెరవని బీఎస్పీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ వ్యాప్తంగా వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరా హోరీ పోరు నెలకొంది. అంతేగాక దేశంలోనే అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో అనూహ్యంగా ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే యూపీలో ప్రముఖ పార్టీగా ఉన్న మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) మాత్రం అంతగా ప్రభావం చూపలేక పోయింది. రాష్ట్రంలో 80 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ వెనుకంజలో ఉంది. అంతేగాక దేశ వ్యాప్తంగా పలు సెగ్మెంట్లలో తమ అభ్యర్థులను పోటీకి దింపినప్పటికీ ఎక్కడా కూడా గెలుపొందలేదు. కేవలం 2.07శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది. అలాగే యూపీలో 9.16శాతం మాత్రమే ఓట్ షేర్ సాధించింది. కాగా, 2014లో ఒక్క సీట్ సాధించిన బీఎస్పీ, 2019లో ఎస్పీ, ఆర్ఆర్ఎల్డీ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయగా 10 స్థానాల్లో గెలుపొందించింది. అయితే ఈ సారి మాత్రం ఏ కూటమితోనూ, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed