- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌కు బిగ్ షాక్: పార్టీకి మాజీ సీఎం రాజీనామా
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో సీనియర్ లీడర్లు బాబా సిద్దిక్, మిలింద్ డియోరాలు పార్టీకి రిజైన్ చేయగా..తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ సైతం కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటావోలేకు లేఖ రాశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్టు తెలిపారు. అయితే చవాన్ ఆదివారం బీజేపీతో చర్చలు జరిపారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. దీంతో పార్లమెంటు ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తాకినట్టైంది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలేతో నెలకొన్న విభేదాల కారణంగానే చవాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు చవాన్ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌తో భేటీ అయ్యారు.కాగా, ప్రస్తుతం భోకర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చవాన్.. డిసెంబర్ 2008 నుంచి నవంబర్ 2010 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
బీజేపీలో చేరే అవకాశం!
ఇటీవల పార్టీకి రిజైన్ చేసిన మిలింద్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరగా, బాబా సిద్దిక్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో చేరిన విషయం తెలిసిందే. అయితే అశోక్ చవాన్ బీజేపీ గూటికి చేరుకోనున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ఈ విషయమై బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరిగినట్టు చర్చ జరుగుతోంది. అశోక్ వెంబడి మరికొంత మంది సీనియర్ నాయకులు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. చవాన్‌కు కాషాయపార్టీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ..చవాన్ బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం లేదని కానీ చాలామంది నేతలు మాత్రం బీజేపీతో టచ్‌లో ఉన్నట్టు తెలిపారు.