BIG News: ఆర్జీ‌కర్ ఆసుపత్రి ఘటనలో మరో కీలక పరిణామం.. మాజీ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు

by Shiva |   ( Updated:2024-08-21 04:56:51.0  )
BIG News: ఆర్జీ‌కర్ ఆసుపత్రి ఘటనలో మరో కీలక పరిణామం.. మాజీ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతాలోని ఆర్జీ‌కార్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే చాలామంది డాక్టర్లు, సహాయక సిబ్బంది నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కి ఆందోళన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి మమతా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలను పరిశీలించేందుకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ ప్రణవ్ కుమార్‌ను నియమించారు. జరిగిన ఘటనపై నెల రోజుల్లోగా సంపూర్ణ నివేదికను అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో తాజాగా కోల్‌కతా పోలీసులు ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై మరో కేసు నమోదు చేశారు. కళాశాలలో అత్యాచార ఘటన జగిరిన రెండు రోజులకు ప్రిన్సిపాల్‌ పదవికి ఘోష్రా రాజీనామా చేశారు. ఇప్పటికే కేసుకు సంబంధించి ఆయనను సీబీఐతో పాటు సిట్ విచారిస్తుండగా, తాజాగా పోలీసులు కేసు నమోదు చేయడంతో సంతోష్ ఘోష్ చిక్కుల్లో పడ్డారు. కాగా, ఆసుపత్రిలో ఆర్ధిక అవకతవకలపై గత జూన్ నెలలోనే ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన పోలీసులు మాజీ ప్రిన్సిపాల్‌ సంతోష్ ఘోష్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story