- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సీఎం కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ మంజూరు
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అదేవిధంగా కేజ్రీవాల్ పిటిషన్‌ను ఐదురుగు సభ్యులు కలిగిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ప్రకటించింది. ఈ క్రమంలోనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అంటూ కామెంట్ చేసింది. కాగా, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. కేజ్రీవాల్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కేజ్రీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మే 17న తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వెంటనే జూన్ 20న కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు క్యాజువల్ బెయిల్ మంజూరు చేయగా, ఆ మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వడం వివాదాస్పదంగా మారింది