బిగ్ బ్రేకింగ్ : బీబీసీ ఢిల్లీ కార్యాలయంలో ఐటీ సోదాలు..

by Rajesh |   ( Updated:2023-02-14 07:34:32.0  )
బిగ్ బ్రేకింగ్ : బీబీసీ ఢిల్లీ కార్యాలయంలో ఐటీ సోదాలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2002 గుజరాత్ అల్లర్ల విషయంలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బీబీసీ ఆఫీస్‌లో ఐటీ రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఇన్‌కమ్ టాక్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. బీబీసీ సిబ్బంది ఫోన్లు ఐటీ అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. కాగా గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ కీలక విషయాలను వెల్లడించిందనే ప్రచారం జరుగుతోంది.

ఈ డాక్యుమెంటరీపై బ్యాన్ విధించడం ద్వారా వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే బీబీసీ డాక్యుమెంటరీ రూపకల్పన వెనుక చైనా హస్తం ఉందనే విమర్శలు కూడా వినిపించాయి. చైనాకు చెందిన ప్రముఖ సంస్థ నుంచి బీబీసీకి పెద్ద ఎత్తున నిధులు సమకూరాయని బీజేపీ నేతలు కొంత మంది ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని బీబీసీ ఆఫీస్‌లో ఐటీ సోదాలు సంచలనంగా మారాయి. అయితే బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం బ్యాన్ విధించగా ఏకంగా ఆ ఛానెల్ ప్రసారాలను దేశంలో నిలిపివేయాలని సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది.

ఇవి కూడా చదవండి : హిండెన్ బర్గ్ - అదానీ అంశంపై తొలిసారి స్పందించిన అమిత్ షా.. ఏమన్నారంటే?

Advertisement

Next Story

Most Viewed