- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BIG BREAKING: అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. 3,300 కిలోల మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న ఎన్‌సీబీ
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఇండియన్ నేవీ బుధవారం తెలిపింది. నిఘా వర్గాల సమాచారం మేరకు సముద్రంలో రెండు రోజుల పాటు ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కనపడ్డ ఓ నౌకను మంగళశారం ఆపి తనిఖీ చేయగా..3300 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డట్టు వెల్లడించింది. అందులో3089 కిలోల గంజాయి,158 కిలోల మెథాఫెంటమైన్, 25 కిలోల మార్ఫిన్ ఉన్నట్టు పేర్కొంది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.2000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)లు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఓడలోని సిబ్బందిని మొత్తం అదుపులోకి తీసుకున్నారు. వారంతా పాకిస్థానీ పౌరులేనని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద డ్రగ్స్ సీజ్ అని ఇండియన్ నేవీ తెలిపింది. అంతకుముందు పూణే, న్యూఢిల్లీలో రూ. 2,500 కోట్ల విలువైన 1,100 కిలోగ్రాముల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఆపరేషన్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మాదక ద్రవ్యాల రహిత భారత్‌కు ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు. ఎన్సీబీ, ఏటీఎస్‌లకు అభినందనలు తెలిపారు.