BIG BREAKING: భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం.. బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత

by Shiva |   ( Updated:2024-08-08 06:58:37.0  )
BIG BREAKING: భారత రాజకీయాల్లో తీవ్ర విషాదం.. బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: వామపక్ష నేత.. రాజకీయ కురు వృద్ధుడు, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ఇవాళ ఉదయం దక్షిణ కోల్‌కతాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించిన ఆయనకు ప్రస్తుతం 80 ఏళ్లు నిండాయి. కాగా.. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గతేడాది అయనకు న్యుమోనియా సోకడంతో వెంటిలేటర్‌పైనే చికిత్సను అందజేస్తున్నారు. అయితే, ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పైనే ప్రాణాలు విడిచారు.

భట్టాచార్య CPM అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. 2000 నుంచి 2011 వరకు బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జ్యోతిబసు తరువాత ఎక్కువ కాలం సీఎంగా పని చేసిన సీపీఎం నాయకుడిగా బుద్ధదేవ్ భట్టాచార్య నిలిచారు. 34 ఏళ్ల కమ్యూనిస్ట్ కంచుకోట అయిన బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. దీంతో అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

Advertisement

Next Story

Most Viewed