- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
దిశ, వెబ్డెస్క్: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. సత్నా సరిహద్దులో ఆగివున్న రెండు బస్సులను ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఎంపీలోని బర్కడ గ్రామంలోని మోహానియా టన్నెల్ వద్ద చోటు చేసుకుంది బస్సులో ప్రయాణిస్తున్న వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీకి వెళ్లి తిరిగివస్తున్నట్లు సమాచారం.
ప్రమాదానికి ట్రక్కు టైర్ పగలడం కారణమని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. రెవా ఎస్పీ ముఖేస్ శ్రీ వాస్తవ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు బస్సులు పార్క్ చేసి ఉండగా వెనక నుంచి వచ్చిన ట్రక్కు టైర్ బస్ట్ కావడంతో బలంగా ఢీ కొట్టిందన్నారు. ఎనిమిది మంది మృతి చెందగా 50 మంది గాయాలయ్యాయన్నారు. 15 - 20 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- madhyaprdesh